LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్


నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ 

అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే
అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను – స్తుతియించుట మానను 
స్తుతియించుట మానను

కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా 
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ      

ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా
ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా 
యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను 
ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక 

అవమానం ఎంతైనా – నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున 
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు     

ఆశలే సమాధియైనా – వ్యాధి బాధ వెల్లువైనా
అధికారం కొప్పుకొని – రక్షణకై ఆనందింతును 
నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగా ఓ నాథా 
పూర్ణ శాంతి నే పొంది – నిన్నే నే కీర్తింతున్    

చదువులే రాకున్నా – ఓటమి పాలైనా
ఉద్యోగం లేకున్నా – భూమికే భరువైనా 
నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు 
నీవుద్దేశించినది – నిశ్ఫలము కానేరదు       

సంకల్పన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి – మేలుకై జరుగును 
యేసుని సారూప్యము – నేను పొందాలని 
అనుమతించిన ఈ – విలువైన సిలువకై 

నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను – తెలిసికొందును 
ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే 
అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే    

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words