
ఆనందముగా యెహోవా నీ కృపలన్ని
ఆనందముగా యెహోవా నీ కృపలన్ని అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2) చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాత వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో సవ్యంబుగా ఈ భువియందున ||ఆనందముగా|| సింహపు పిల్లలు – ఆకలిగొనిన- యెహొవ సహాయుడందరికి ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు అహా! ఏమందు నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా|| ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్ ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ ||ఆనందముగా|| పర్వతంబులు – పారిపోయినను- ఉర్విలోమార్పు కలిగిననూ తరుణములు విరోధముగపై లేచినా – స్మరియించెద నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా||


Follow Us