
అద్భుత వంతుడు మన దేవుడు
ప॥ అద్భుత వంతుడు మన దేవుడు - ఆశ్చర్యకార్యములన్ జరిగించును (2) ఎవరు చేయలేని అద్భుతముల్ - యేసయ్య మనకై చేయునిశ్చయం (2) స్తుతిస్తోత్రం ఇశ్రయేలు పాడగా జయమిచ్చెన్ శత్రువులపై స్తుతిస్తోత్రం అని మనం పాడగా జయమిచ్చెన్ సాతానుపై (2) 1. దేవుని బలమైన హస్తం చాపి - ఎర్రసముద్రమున్ పాయలుగా చేసెన్ (2) భయమున్ కలవరం పోరాటముల్ - సర్వాధికారి యేసు తొలగించెను (2) స్తుతిస్తోత్రం ఇశ్రయేలు పాడగా జయమిచ్చెన్ శత్రువులపై స్తుతిస్తోత్రం అని మనం పాడగా జయమిచ్చెన్ సాతానుపై (2) 2. యెహోషువ ప్రార్థించగ మహదేవుడు - సూర్యుని మధ్యాకాశములో నిల్పెను (2) మన విరోధులన్ లయం చేయను - నీతిసూర్యుడేసు యుద్దంచేయును (2) స్తుతిస్తోత్రం ఇశ్రయేలు పాడగా జయమిచ్చెన్ శత్రువులపై స్తుతిస్తోత్రం అని మనం పాడగా జయమిచ్చెన్ సాతానుపై (2) 3. షడ్రకు మేషెకబెద్నగో దేవుడు - అగ్నిగుండమునుండి రక్షించెను (2) శోధనల్ అగ్నివంటి మహాశ్రమలలో-మహిమాస్వరూపి యేసు మనతో ఉండున్ (2) స్తుతిస్తోత్రం ఇశ్రయేలు పాడగా జయమిచ్చెన్ శత్రువులపై స్తుతిస్తోత్రం అని మనం పాడగా జయమిచ్చెన్ సాతానుపై (2) 4. దేవునికి అసాధ్యమైనది ఉన్నదా యేసుని విశ్వసించి మహిమన్‌చూడు (2) సమస్త నీకార్యములన్ సఫలపరచున్ జయవీరుడేసు ముందు వెళ్ళుచున్నాడు (2) స్తుతిస్తోత్రం ఇశ్రయేలు పాడగా జయమిచ్చెన్ శత్రువులపై స్తుతిస్తోత్రం అని మనం పాడగా జయమిచ్చెన్ సాతానుపై (2)


Follow Us