
దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే
దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా ? ధనము కోరుతావా ఆ..ఆ... ఘనము కోరుతావా ఆ..ఆ... (2) అల్పకాల పాపభోగములను కోరుతావా || దేవుడే || జ్ఞానమును అడిగాడు పాపములో మునిగి అజ్ఞానిగా మిగిలాడు సొలొమోను ఆనాడు బలమును పొందాడు బలవంతుడయ్యాడు బలహీనతలో పడి పోయాడు సమ్సోను జ్ఞానులు బలవంతులు బంధీలై పోగా బలహీనుడవైన నీవు ఏమి కోరుతావో. ప్రభు కృపను కోరుతావో... || దేవుడే || మన రక్షణ కోరాడు మనకై ఏతెంచాడు మనస్థానమందు నిలచి మరణించె మనప్రభువు ఆత్మలను అడిగాడు హతసాక్షి అయ్యాడు అందరికి మాదిరిని చూపాడు ఆ పౌలు యేసువైపు చూస్తు నీవు పయనమయోతావో ఆ దేవుని దయను కోరి ధన్యుడౌతావో. మరి ఏమి కోరుతావో… || దేవుడే ||


Follow Us