
శుభము శుభము శుభము
శుభము శుభము శుభము నీకు శుభము శుభము శుభము అనుపల్లవి:- యేసుకు నీవు ప్రియముగా ఉంటే ఎప్పుడూ నీకు శుభమే యేసుకు నీవు ప్రీతిగా ఉంటే ఎప్పుడూ నీకు శుభమే 1) భయపడకు నీకు శుభము బాధపడకు నీకు శుభము దానియేలు వలె క్రమం తప్పకుండా స్తుతియించి ప్రార్థించుము 2) కలవరపడకు శుభము కంగారు పడకు శుభము అబ్రహాము వలె ప్రతి స్థలములో అర్పించి ప్రార్థించుము 3) తొందరపడకు శుభము దిగులు పడకు నీకు శుభము నెహెమ్యా వలే ఉపవాసముతో కన్నీరు కార్చి ప్రార్థించుము 4)ఆందోళన పడకు శుభము ఉద్రేక పడకు నీకు శుభము దావీదు వలె బహు వినయంతో ధ్యానించి ప్రార్థించుము 5) ఒంటరిన అనుకోకు శుభము ఏమీ లేవనుకోకు శుభము యాకోబు వలె పట్టుబట్టి బ్రతిమాలి ప్రార్థించుము 6) కృంగిపోకు నీకు శుభము చింతపడకు నీకు శుభము హన్నా వలే దేవాలయంలో బహుగా ఏడ్చి ప్రార్థించుము


Follow Us