
ఆశ్రయము నీవే ఆధారము నీవే
ఆశ్రయము నీవే ఆధారము నీవే ఆదరణ నీవే శరణయ్యా ఏసయ్యా శరణం శరణం నీవే శరణం 1. సిలువను మోసిన చేతులతో ఎత్తుకొంటివే గాయమునొందిన హస్తములో చెక్కుకొంటివే కలువరిలో రుధిరములో కడిగితివా నా కలుషమును 2. సిలువలో నీతో మరణించి మరణించి మరణము గెలచిన నీలో నె జీవించీ మంచి నేలనై ఫలమిచ్చి అరువదంతులుగా నూరంతలుగా 3. సిలువను ప్రకటించే సైనికుడన్, సైనికుడన్ సిలువను మోసే శ్రామికుడన్, శ్రామికుడన్ సిలువ సాక్షినై - సిలువ శక్తినై సింహల నోళ్ళను మూయించెదను 4. నా విశ్వాసమే సువర్ణమై, సువర్ణమై అగ్ని పరీక్షకు నిలిచినదై ప్రభువా నీవే ప్రత్యక్షమైనపుడు మెప్పు మహిమ ఘనతా నాకే కదా 5. మొదటివాడా - మహిమోన్నతుడా మహిమోన్నతుడా మొదటిగా నన్ను ప్రేమించితివే ప్రేమించితివే మొదటి ప్రేమతో నిన్ను ప్రేమించి మొదటివానిగా నిన్ను సేవించెదను


Follow Us