
లేవనెత్తగలవు యేసయ్య నన్ను
లేవనెత్తగలవు యేసయ్య నన్ను క్షేమమివ్వగలవు శాశ్వతకాలము తొట్రిల్లకుండ నా కాలు జారకుండ కాపాడగలవు కడవరకు 1. కలలోనైన కలవరింతలోనైన పరిశుద్ధునిగా నన్ను చేయగలవు తొట్రిల్లకుండ నా కాలు జారకుండ కాపాడగలవు కడవరకు 2. అర్థరాత్రిలోనైన నా ఆలోచనలన్ని నిర్దోషమైనవిగా చేయగలవు వ్యర్థత వినకుండ చెడుగానకుండ కాపాడగలవు కడవరకు 3.నా పరిస్థితులన్ని అననుకూలమైనను తప్పించగలవు ఆశ్చర్యకరముగా ఎవరు రాలేరు నాకు హానిచేయలేరు కాపాడగలవు కడవరకు 4. నేను బలిగా మారిన బ్రతికించగలవు నీ వాగ్దానములను నెరవేర్చగలవు సందేహించను ఒక్క క్షణమాత్రమైన కాపాడగలవు కడవరకు 5. నా దినములు గడచిన కొలది నన్ను ఆత్మీయ లోతుకు నడిపించగలవు నీ నీతి నాలో స్థాపించగలవు కాపాడగలవు కడవరకు


Follow Us