
ఆత్మ స్వరూపుడా నా యేసువా
ఆత్మ స్వరూపుడా నా యేసువా - నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మ శక్తిని నా కొసగుమా పరిశుద్ధాత్మ దేవుడా - నీ ఆత్మతో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా 1.మండుచున్న పొదలో అగ్నివై - భక్తుడు మోషేను దర్శించిన దేవా కర్మెలు గిరిపై బలి అర్పణకై దహించు అగ్నిగా దిగినా దేవా మమ్మును దర్శించుమా మాపై దిగిరమ్మయా 2. ఆది సంఘములో నీ శిష్యులపై ఆత్మ శక్తిని కుమ్మరించితివి నీ కార్యములు గంభీరముగా జరిగించుటకు మమ్మును పంపుమా ఆత్మతో వెలిగించుమా శక్తిని దయచేయుమా


Follow Us