
నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది
నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది నీ చేతి నుండే అన్నీ పొందేది (2) నీ ఆశీర్వాదమే ఐశ్వర్యంమిచ్చేది (2) మాకు జీవం ఘనత తెచ్చెది (2) 1.నీవు క్షమియిస్తే కదా – పాపం పరిహారం అయ్యేది (2) నీవు బలమిస్తే కదా – శత్రువులపైన విజయం పొందేది (2) 2.నీవు శేలవిస్తే కదా – క్షేమం సంతోషం వచ్చేది (2) నీవు కరుణిస్తే కదా – కష్టమునకు తగ్గ ఫలితం దక్కేది (2) 3.నీవు వరమిస్తే కదా – సంఘం ఉపయోగం పొందేది (2) నీవు నడిపిస్తే కదా – కాలు జారకుండా గమ్యం చేరేది (2)


Follow Us