
తల్లిగర్భమందు నన్ను నిర్మించిన
తల్లిగర్భమందు నన్ను నిర్మించిన - నా సహాయకుడా నీకే స్తోత్రమేసయ్యా తండ్రిచిత్తమందు నన్ను రక్షించిన నా విమోచకుడా నీకే స్తోత్రమేసయ్యా ||2|| అ||ప : బాధలన్నీ మరచి నిన్నారాధింతును భారమంతా తీర్చే నిన్నారాధింతును ||2|| నీకే ఆరాధన - ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన - నీకే ఆరాధన మునుపటి శ్రమలను - నే మరచునంతగా - నూతనక్రియను చేయువాడవు ||2|| అరణ్యములో త్రోవను - ఎడారిలో నదులను ||2|| నూతనముగను కలుగజేయువాడా ||2|| పక్షిరాజువలెనె - నూతన బలమును - నాకిచ్చుచున్నావు నీవైపు చూడగా ||2|| పాతవన్నీ గతియించే - సమస్తము క్రొత్తవాయే ||2|| నూతన సృష్టినై నీయందుండెద ||2||


Follow Us