
నా పైకి దిగి రమ్మయ్య
నా పైకి దిగి రమ్మయ్య - పరిశుద్ధాత్మతో నన్ను నింపుయ్య తైలాభిషేకమా- క్రీస్తు అభిషేకమా ||2|| 1) అహరోను తలపై - మోషే తైలము పోయగా ప్రధాన యాజకునిగా నిన్ను సేవించగా ||2|| అట్టి అభిషేక తైలము నాపై పోయుమా నిన్ను సేవించే యాజకునిగా చేయము ||2|| 2) సోలోమోను తలపై సాదోకు తైలము పోయాగా మహాజ్ఞానియై ఆలయాన్ని నిర్మించగా ||2|| అట్టి అభిషేక తైలము నాపై పోయుమా సంఘన్ని నిర్మించే జ్ఞానము దయ చేయుమా ||2|| 3) ఏలియా అభిషేకం ఎలిషా పైకి దిగి రాగా రెట్టింపు ఆత్మతో అద్భుతములు చేయాగా ||2|| అట్టి రెట్టింపు ఆత్మతో నన్ను నింపుమా నికై బలమైన కార్యములు చేయించుమా ||2||


Follow Us