
కృప వెంబడి కృపతో నడిపించిన
కృప వెంబడి కృపతో నడిపించిన ఏమని నే నిన్ను స్తుతింతును లోపములెంచక ప్రేమించిన ఏమని నీ కృపను వర్ణింతును నా యేసయ్య నీ మహిమను నేను ప్రకటించుటకే ఇల బ్రతికియున్నాను. నీ పని కొరకై కొనసాగుచున్నాను కృపామయా....కృపామయా... నీ కృపలేనిదే నేను బ్రతకలేనయ్యా 1. నీ సాక్షిగా నేను ప్రతి చోట నిలుచుటకు నీ స్తోత్రమును ప్రచురము చేయుటకు ॥2॥ నీ సన్నిధి నాకు తోడుంచినావు ఏ కీడు రాకుండ కాపాడినావు ॥2॥ విడువక నీ కృప చూపించినావు ॥2॥ కృపామయా....కృపామయా... నీ కృపలేనిదే నేను బ్రతకలేనయ్యా ||2|| 2. నా పాదములకు ఏ రాయి తగులకుండా నీ చేతుల మీద ఎత్తి పట్టుకున్నావు ॥2॥ నీ రెక్కలతో నను కప్పినావు నీ అరచేతిలో నను దాచినావు ॥2॥ నీ కనుపాపగా నను కాచినావు ॥2॥ కృపామయా....కృపామయా... నీ కృపలేనిదే నేను బ్రతకలేనయ్యా ||2||


Follow Us