
నిన్నే స్తుతియింతునయ్యా
పల్లవి:నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్య నీవే నా మార్గము సత్యము జీవము - నీవేనా రక్షణ విమోచన దుర్గము నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) 1) ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు - మమ్మును కాపడుటకు నీవే బలిగా మారవు నీ లాంటి దేవుడు ఎవరయ్య ఈ జగమందు- నీలాంటి దేవుడు లేడయ్య ఆరాధింతును నిన్నే ఆరాదింతును 2) నేను వెతకకపోయిన నన్ను వెదకితివి- నే ప్రేమించకపోయిన నాకై ప్రాణము పెట్టితివి నీ లాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య ఆరాధింతును నిన్నే ఆరాదింతును


Follow Us