
నా పూర్ణహృదయముతో - నీకే ఆరాధనా
నా పూర్ణహృదయముతో - నీకే ఆరాధనా నీవు చేసిన మేలులకై - కృతజ్ఞత ఆరాధన (2) అ॥ప : స్తుతి స్తుతి స్తుతి ఆరాధన నిరంతరం నీవే ఆలాపన (2) 1. కన్నీళ్ళ కొలనులో పూసిన కలువలా కష్టాల లోగిలిలో ఎదిగిన మొక్కలా (2) నా గతమంతా నేనున్నా నీవే తోడై దీవించినావు దేవా మునుపటికంటే అధికముగా నీవే తోడై దీవించువాడవయ్యా (2) స్తుతి స్తుతి స్తుతి ఆరాధన నిరంతరం నీవే ఆలాపన (2) 2. నీ ప్రేమ పొలములో ఫలవృక్షమునై నీ మహిమ లోగిలిలో నను బలపరచి (2) నా జీవితమే సాక్ష్యముగా నీవే మార్చి దీవించినావు దేవా మునుపటికంటే అధికముగా నీవే తోడై దీవించువాడవయ్యా (2) స్తుతి స్తుతి స్తుతి ఆరాధన నిరంతరం నీవే ఆలాపన (2)


Follow Us