
మాపైన నీవు చూపు ప్రేమకై
మాపైన నీవు చూపు ప్రేమకై.... కళ్లు చెమ్మగిళ్ళేనయా....(2) మాలో ఏముందయా మాకర్థమే కాదయా మాలో ఏముందయా అస్సలర్థమే కాదయా జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్య యేసయ్య.... ఒదిగిపోతానయ్య.... ఒదిగిపోతానయ్య... ఒదిగిపోతానయ్య 1.అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయేగా....(2) నీకే... తండ్రిగా....మార్చినా స్తుతించినా.... ఆ ఋణమే తీరునా (2) ఒదిగిపోతానాయా... నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా ఒదిగిపోతానాయా.... నీ సన్నిధిలో... ఒదిగిపోతానాయా 2.ఆప్తులైన వారే... మమ్ము విడిచి వెళ్ళినా మాకున్న వారే..... మాకు దూరమైనను...(2) నీవే... తోడై నిలువగా..... స్తుతించినా..... ఆ ఋణమే తీరునా.... (2) ఒదిగిపోతానాయా... నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా ఒదిగిపోతానాయా.... నీ సన్నిధిలో... ఒదిగిపోతానాయా


Follow Us