
నేనుండగా నీ చేతిలో - నే ఓడిపోను దేవా
నేనుండగా నీ చేతిలో - నే ఓడిపోను దేవా నీవుండగా నా ఇంటిలో నే కృంగిపోను దేవా (2) అ„ప: ఆరాధన నీకే ఆరాధన నీకే (2) 1. ఊహకు అందక కలిగెనులే - ఎన్నో ఓటములు ఆగిపోయెను ఆనందపు అడుగులు (2) నా దేవా నాకున్నావు తోడుగా దీవించావు నేడున్న రీతిగా నా ఇన్నేళ్ళ కన్నీళ్ళ బాటను మార్చావు ఆనంద యాత్రగా (2) 2. తీరము చేర్చే వారధి లేదని - వేదన చెందాను హృదయ భారముతో అలసిపోయాను (2) నా దేవా నీవేనయ్యా సారధి నా ఆనంద తీరపు వారధి దీవించావు దయగల కాపరి ఆరాధింతు నిన్నే నా ఉపకారి (2) ఆరాధన నీకే - ఆరాధన నీకే (2)


Follow Us