
ఆనందింతు నీలో దేవా
ఆనందింతు నీలో దేవా అనుదినం నిను స్తుతించుచు (2) మధురమైన నీ నామమునే (2) మరువక ధ్యానించెద ప్రభువా ||ఆనందింతు|| ఆత్మ నాథా అదృశ్య దేవా అఖిల చరాలకు ఆధారుండా (2) అనయము నిను మది కొనియాడుచునే ఆనందింతు ఆశ తీర (2) ||ఆనందింతు|| నాదు జనములు నను విడచినను నన్ను నీవు విడువకుండా (2) నీ కను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన (2) ||ఆనందింతు|| శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు మేఘమందు రానైయున్న (2) ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు అంతం వరకును భద్రపరచుము (2) ||ఆనందింతు|| శ్రమలు నన్ను చుట్టిన వేళ చింతలో కృశించిన వేళ (2) అభయముగా నీ దర్శనమిచ్చి శ్రమలు బాపి శాంతినిచ్చితివి (2) ||ఆనందింతు||


Follow Us