
ఘనుడైన యేసు ఎంచుకున్న
ఘనుడైన యేసు ఎంచుకున్న గొప్ప సేవకా ఘనుడైన యేసు ఎంచుకున్న గొప్ప సైనికా అ.ను . పిలువబడినవాడా - యేర్పరచబడినవాడా రాజవంశమందు - ఎన్నికైనవాడా దైవసేవకా - ఘనమైన సేవకా 1. మోకాళ్ళ ప్రార్థన -నేర్చుకున్న సేవకా దైవసన్నిధే నిధిగా - యెంచుకున్న సేవకా (2) నిధిలోనే దాగివుంది - నీ ప్రతిఫలము (2) తగిన కాలమందు ఇచ్చును బహుమానం బహుమానం పొందినప్పుడే - బ్రతుకున ఆనందం 2. పిలిచినవాడు - నమ్మదగినవాడు నేర్పును, నడుపును - నిత్య తండ్రి తాను (2) నీముందు నడుచుచు దారి చూపు దేవుడు (2) పర్వతములను చదును చేయును లోయలైనను పూడ్చివేయును (2) 3. అవరోధాలెన్నో - నీకు అడ్డు వచ్చినా అధిగమించి క్రీస్తుతో - సాగిపొమ్ము నీవు (2) నిలువలేదు ఏ శక్తి నీ ముందు ఎన్నడు (2) నీ భక్తే పరమందు జీవ కిరీటము తలయెత్తే యేసున్న భయమేల నీకు


Follow Us