
సమస్తానికి - ఆధారమైన యేసయ్య
సమస్తానికి - ఆధారమైన యేసయ్య కృపతో నన్ను - జ్ఞాపకం చేసుకోవయ్యా ఏ దారిలో వెళ్లాలో తెలియక - ఆగిపోయానయ్యా మార్గము చూపించి - కరుణతో నడిపించు యేసయ్య 1) ఆత్మలోక్రుంగి అలసిననాకు - నీవే ఆధారము నా వేదనలో ఒంటరి బ్రతుకులో - నీవే నా ఆశ్రయము మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య 2) గడచినా కాలం నీ మేలులను - నేను తలపోయగా నీయందే నాకు ఆశలు చిగురించి - ఆనందమునిచ్చెను మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య 3) గాఢాంధకారం కమ్మినవేళ - నీవే నా దీపము కన్నీటి కెరటాలు నను ముంచువేళ - నీవే నా నిరీక్షణ మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య


Follow Us