
కలవంటిది నీ జీవితము
కలవంటిది నీ జీవితము కడు స్వల్ప కాలము యువకా అది ఎంతో స్వల్పము (2) విలువైనది నీ జీవితం వ్యర్ధము చేయకుమా యువకా వ్యర్ధము చేయకుమా బహు విలువైనది నీ జీవితం వ్యర్ధము చేయకుమా యువతీ వ్యర్ధము చేయకుమా నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విష సర్పము యువకా అది కాలు జారే స్థలము (2) ఉన్నావు పాపపు పడగ నీడలో నీ అంతము ఘోర నరకము యువకా అదియే నిత్య మరణము (2) నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును పాపం క్షమియించి రక్షించును (2) ఆ మోక్షమందు నీవుందువు యుగయుగములు జీవింతువు నీవు నిత్యము ఆనందింతువు (2)


Follow Us