
యవ్వనుడా యవ్వనుడా
యవ్వనుడా యవ్వనుడా - ఈ లోకం చెడ్డదిరా ఇప్పుడైనా ఇప్పుడైనా - నీ కళ్ళు తెరువరా ||2|| పాపం పాము వంటిదిరా పగబట్టి నిన్ను తరుమునురా కాటు వేయక మానదురా ఎవరిని అది వదలదురా ||2|| ఏమాయను సంసోను - వ్యభిచార మత్తులో ముగిసెనురా రెండు కళ్ళు కోల్పోయెను - దైవాభిషేకం పోయెనురా (2) బలవంతుడే బలియైనాడు - యోచించు నీ గతి ఏమోనో (2) తప్పిపోయిన తనయుడు - తండ్రి ప్రేమను విడిచెను సర్వము కోల్పోయిన - దీనస్థితికి దిగిజారెను (2) యేసు ప్రేమను విడిచిపోతే యోచించు నీ గతి ఏమోనో (2) పాపము నుండి పారిపోరా - ఈ లోక స్నేహం విడిచిపోరా యోసేపులా నీవుండురా - జారత్వము విడిచిపోరా(2) ఫలించుడి కొమ్మగా ఉండరా - అందరికీ (ప్రజలందరికీ)మాదిరిగా ఉండురా (2)


Follow Us