
స్తుతికి పాత్రుడ యేసయ్యా
స్తుతికి పాత్రుడ యేసయ్యా నా స్వాస్థ్య భాగము నీవయ్యా (2) పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద (2) నీవే నా రక్షణ – నీవే నా స్వస్థత నీవే నా విడుదల (2) ||స్తుతికి|| పాపఊభిలో నుండి – పైకి లేపితివి మరణఛాయను తొలగించి – కరుణ చూపితివి (2) నీ వైపే చూస్తూ – నీతోనే నడుస్తూ నీ వెనకే చేరెద యేసూ (2) ||నీవే|| జీవాహారము నీవే – జీవ జలము నీవే నీదు నామమే శక్తి – లేదు ఇలలో సాటి (2) ప్రతి మోకాలొంగును – ప్రతి నాలుక ఒప్పును యేసు రాజా నీ యెదుట (2) ||నీవే|


Follow Us