
యేసుని నామములో – మన బాధలు పోవును
యేసుని నామములో – మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును - శోధనలో జయమొచ్చును మృతులకు నిండు జీవమొచ్చును - హృదయములో నెమ్మదొచ్చును యేసు రక్తముకే – యేసు నామముకే యుగయుగములకూ మహిమే అభిషిక్తులగు తన దాసులకు ప్రతి సమయమునా జయమే ||యేసుని|| 1.ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసనపరులైనా ఆర్ధికముగా లోటులెన్నున్నా ఆశలు నిరాశలే ఐనా ప్రభుయేసుని నమ్మినచో నీవు విడుదలనొందెదవు పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు 2. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా నీ స్థితి నేడేదైనా నిత్యజీవము పొందెదవు


Follow Us