
నీలోనే ఆనందం నా దేవా
నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్న నేడు నిరంతరం మారని దేవా ఈ లోకమంతా నేను వెతదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను ఈ లోకం ఒక మాయని - తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదు అనుకున్నాను తప్పిపోయిన కుమారుని నేనయితే - నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్య ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా నన్ను మరువని ప్రేమ నీ దయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా


Follow Us