
ఊహకు అందని ప్రేమ
ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమా వెలకు అందని ప్రేమ నా క్రీస్తు ప్రేమా తరలెన్ని మారిన యుగాలెన్ని గడచినా జగానా మారనిది యేసు ప్రేమా ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమ ప్రేమా ప్రేమా నా తండ్రి ప్రేమా (2) 1. మనిషిని మనిషిని ప్రేమించుటకు స్వార్ధం మూలకారణం దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం (2) మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు (2) 2. జీవితమంత పోరాటం ఏదో తెలియని ఆరాటం నిత్యం ప్రేమకై వెదకటం దొరకకపోతే సంకటం (2) మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడ లంచం యేసు ప్రేమ శాశ్వతం జీవితానికే సార్ధకం (2)


Follow Us