
ఆకాశమువైపు నా కన్నులేత్తుచున్నాను
స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రము యేసయ్యా “2” ఆకాశమువైపు నా కన్నులేత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా “1” ఆకాశంవైపు నా కన్నులేత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా “1” కలవరమునొందను నిన్ను నమ్మియున్నాను “2” కలత నేను చెందను కన్నీరు విడువను “2” “ఆకాశంవైపు” ఆకాశముపై నీ సింహాసనంయున్నది రాజదండముతో నన్నేలుచున్నది “2” నీతిమంతునిగా చేసి నిత్యజీవమనుగ్రహించితివి “2” నేనేమైయున్నానో అది నీ కృపయేకదా “2” “ఆకాశంవైపు” ఆకాశమునుండి నాతో మాట్లాడుచున్నావు ఆలోచనచేత నన్ను నడిపించుచున్నావు “2” నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి “2” నీవుండగా ఈ లోకంలో ఏదియు నాకక్కర లేనేలేదయ్యా “2” “ఆకాశంవైపు” ఆకాశమునుండి అగ్ని దిగివచ్చియున్నది అక్షయజ్వాలగా నాలో రగులుచున్నది “2” నా హృదయమే నీ మందిరమై నీ తేజస్సుతో నింపితివి “2” కృపాసనముగా నన్ను మార్చి నాలో నిరంతరము నివసించితివి “2” “ఆకాశంవైపు” ఆకాశము నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షము నీ చేతిపనిని ప్రచురించుచున్నది “2” ఆశలేని మాటలే నీ స్వరమే వినబడనిది “2” పగలు బోధించుచున్నది రాత్రి జ్ఞానమిచ్చుచున్నది “2” క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకై నిర్మించుచున్నావు “2” మేఘరధములపై అరుదెంచి నన్ను కొనిపోవా “2” ఆశతో వేచియుంటిని త్వరగా దిగిరమ్మయ్యా “2” “ఆకాశంవైపు”


Follow Us