LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీవే శ్రావ్యసదనము


నీవే  శ్రావ్యసదనము
నీదే  శాంతి వదనము
నీ  దివి సంపద నన్నే చేరగా
నా  ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా
నా ప్రతి స్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే  యేసయ్యా
                            " నీవే "
1.విరజిమ్మే నాపై కృప కిరణం
విరబుసే పరిమళమై కృప కమలం  "2"
విశ్వాసయాత్రలో ఒంటరినై
విజయ శిఖరము చేరుటకు
నీ దక్షిణ హస్తం చాపితివి
నన్నాదుకొనుటకు వచ్చితివి
నను బలపరచి నడిపించే
నా  యేసయ్యా
                              "నీవే "
2. నీ నీతి నీ  రాజ్యం వెదకితిని
నిండైన సౌభాగ్యం పొందుటకు "2"
నలిగి విరిగిన హృదయముతో
నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయస్కరమైన దీవెనతో
శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు
నను ప్రేమించి పిలచితివి
నా  యేసయ్యా
                              "నీవే "
3. పరిశూద్దాత్మకు నిలయముగా
ఉపదేశమునకు వినయముగా "2"
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయా
నా పితరులకు ఆశ్రయమై
కోరిన రేవుకు చేర్పించి
నీ  వాగ్దానం నెరవేర్చితివి
 నా యేసయ్యా  
                            "నీవే "

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words