
కల్యాణమే వైభోగమే
కల్యాణమే వైభోగమే - పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు - చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే - పెరిగే నిరంతర సంతోషమే (2) ప్రేమను పంచుకునే తోడుకై - ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా - ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే - మురిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన దినమే - మన కన్నులకు ఆశ్చర్యమే " కళ్యాణ " మరణము తప్ప మరి ఏదియు - విడదీయనీది ఈబంధము వ్యాధి బాధ సంతోషం లో - కలిమి లేమి ఆరోగ్యం లో ప్రభువే ఒక్కటిగా దీవించెను - మనులే అందుకు నియమించెను పరలోకము లో నిర్ణయించెను - నర లోకము లో ఏర్పరచెను " కళ్యాణ "


Follow Us