
గొప్పదేవా యెహోవా సృష్టికర్త
గొప్పదేవా యెహోవా సృష్టికర్త నీకసాధ్యమైనది ఇల లేనేలేదయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది 1. ఆకాశముల్ ఈ సృష్టియంత నీ మాట మహిమే మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే ఆశ్చర్యకరుడా అనంతజ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండుట ప్రభావముగల దేవా యెహోవా దేవా 2.పాపములో పొర్లాడినా మమ్మును పవిత్రపరచి శుద్దులుగా నిబంధన ప్రజలుగా రూపించిన కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్దుడా పాపుల రక్షక మా యేసు రాజా 3.హృదయమనే ద్వారమునుండి లోనికి వచ్చి కఠినమనస్సును కరుణమనస్సుగా మార్చితివే సత్యస్వరూపి అదృశ్యదేవుడా క్రియాశీలి సర్వశక్తిదాత ఆదరించే దేవా పరిశుద్దాత్ముడా


Follow Us