
అసామానుడైన వాడు
అసామానుడైన వాడు - అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు - కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును 1) అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిను అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమా తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై శుత్రువు చేతికి నిను అప్పగించాడు 2) పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రమపడిన ఫలితమేమి లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరీక్షణే లేకున్నా మరది తలరాతని దిగులుపడకుమా మారాను మధురముగా మార్చాను నీకై మేలులతో నిను తృప్తిపరచును 3) ఒంటరి పోరాటమే విసుగురేపిన - పొందిన పిలుపే భారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న - నమ్మదగినవారులేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిను మరచిపోవునా


Follow Us