
కరుణా గలా యేసయ్యా
కరుణా గలా యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా నా సొంత ఆలోచనేలే కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనేలే నాకు లాభమాయేను ఆలోచనకర్తా.. ఆలోచనకర్తా.. నీ ఆలోచనాయే నాకు క్షేమమయ్యా నిన్ను నేను విడచినా విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనిదియున్న విడిపించావు నన్ను విడువని విమోచకుడా విడువని విమోచకుడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా నా జీవితమంతా జీవించెద నీ కొరకే నాకు ఉన్న సమస్తము అర్పించెద నీ సేవలో పిలిచినా నిజదేవుడా పిలిచినా నిజదేవుడా నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా


Follow Us