
నాలో ఏమి చూచి నీవు
నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు మర్త్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు యేసయ్య యేసయ్య నా యేసయ్య నా తల్లి గర్భమునే నను కోరితివి విశ్వాస గృహములో నన్నుచేర్చితివి అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు ప్రకటింప నీ చరితం - నా జన్మ నిజ ఫలితం ఘనులైన వారే నీ యెదుట నున్నను బలమైన వారే ఎందరో ఉన్నను కన్నీళ్ల కడలిలో శ్రమల సుడులలో నా స్థితి చూచి నన్ను చేరదీసి మార్చితివి నీ పత్రికగా - కడవరకు నీ సాక్షిగా ప్రేమానురాగం నీ సంస్కృతియే కరుణాకటాక్షము నీ గుణసంపదయే నలిగినా రెల్లును విరువనివాడ చితికిన బ్రతుకును విడువనివాడ నా పైన నీకెందుకు ఈ తగని వాత్సల్యము ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు వర్ణనకందని అతిసుందరుడవు ఇరువది నలుగురు పెద్దల మధ్యలో మహిమ ప్రభావముతో సింహాసనముపై ఆసీనుడా యేసయ్య నా స్తుతి నీకేనయ్యా


Follow Us