
నన్ను చూచువాడా నిత్యం
నన్ను చూచువాడా నిత్యం కాచువాడా (2) పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నే లేచియుండుట (2) బాగుగ యెరిగియున్నావు- రాజా 1. తలంపులు తపనయు అన్నీ - అన్నియు యెరిగియున్నావు నడచిననూ పడుకున్ననూ అయ్యా! నీవెరిగియున్నావు ధన్యవాదం యేసు రాజా (2) 2. వెనుకను ముందును కప్పి - చుట్టూ నన్ను ఆవరించావు (నీ) చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా (2) 3. పిండమునై యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం యేసు రాజా (2)


Follow Us