LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఆరని ప్రేమ ఇది


ఆరని ప్రేమ ఇది - ఆర్పజాలని జ్వాల ఇది
అతి శ్రేష్టమైనది - అంతమే లేనిది
అవధులే లేనిది - అక్షయమైన ప్రేమ ఇది
కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది } 2|| ఆరని ప్రేమ ||

సింహాసనము నుండి - సిలువకు దిగి వచ్చినది
బలమైనది మరణము కన్నా - మృతి ని గెల్చి లేచినది } 2
ఇది సజీవమైనది - ఇదే సత్యమైనది
ఇదే నిత్యమైనది - క్రీస్తు యేసు ప్రేమ ఇది } 2
కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది } 2|| ఆరని ప్రేమ ||

నా స్థాన మందు నిలిచి - నా శిక్ష నే బరియించి
క్రయ ధనమును చెల్లించి - గొప్ప రక్షణ నిచ్చినది } 2
నాకు విలువ నిచ్చినది - నన్ను వెలిగించినది
ఆ ఉన్నత రాజ్య మందు - నాకు స్థాన మిచ్చినది } 2
ఉన్నత ప్రేమ ఇది - అత్యున్నత ప్రేమ ఇది } 2|| ఆరని ప్రేమ ||

భూ రాజులు అధిపతులు - రాజ్యాలు అధికారాలు
చేరయైన ఖడ్గమైన - కరువైన ఎదురైనా } 2
ఎవరు ఆర్పలేనిది - ఎవరు ఆపలేనిది
ప్రవహించుచున్నది - ప్రతి పాపి చెంతకు } 2
ప్రేమ ప్రవాహమిది - యేసు ప్రేమ ప్రవాహమిది } 2

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words