
నమ్మదగిన యేసయ్య నాకై
నమ్మదగిన యేసయ్య నాకై విడువని హస్తము చాపితివే ||2|| ఇంతవరకు నిలిపినది నీ వాక్యమే నన్ను నడిపినది ఆ|ప|| :- మనుషులకైతే అసాధ్యమే - నీకైతే ఇది సాధ్యమే 1) పాపపు ఊబిలో లేవలేని స్థితిలో - లేవనెత్తెను నీ బహువే కదా ||2|| నీ వాక్యమే నన్ను పరిశుద్ధ పరచి - నీ సన్నిధిలో నిలిపినది ||2|| 2) గూరి లేని జీవితాన దరి నీవై - భయమేలా నంటూ వెన్ను తట్టి నిలిచావే ||2|| అద్దరి చేర్చి నెమ్మది నిచ్చి - నా ప్రాణమును సేదతీర్చితివే ||2|| 3) రెఫాయము లోయలోన దావీదు పక్షాన - జయ ధ్వనిచ్చి విడిపించితివే ||2|| జయ ధ్వని లేని నా జీవితాన్ని - విజయ తీరాన నన్ను నిలిపితివే ||2||


Follow Us