
ఎరుగని రీతిగా
ఎరుగని రీతిగా నను దర్శించే నీ కృప ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప కృప కృప కృప గల గల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప శిలనైనా నను కరిగించెనే వెలయే లేని నీ కృప పావనమైన జీవన యానములో క్షేమము నిచ్చే నీ కృప రమ్యమైన నీ ప్రేమతో గమ్యము చేర్చే నీ కృప


Follow Us