
భూలోక న్యాయాధిపతి
భూలోక న్యాయాధిపతి నా తీర్పరి నా నేర్పరి నన్ను కాపాడు కాపరి నా యేసయ్య వలచావు నీవు - మలచావు నన్ను క్రీస్తు సాక్షిగా - జగమంత చాటగా అ.ప :- ఏమివ్వగలను యేసయ్య నన్ను ఓర్చిన నీ ప్రేమకు నా స్తుతి సునాదము స్వీకరించుము నా బ్రతుకు కాలమంతయు 1) నిరాశల నింగిలో - ఉషోదయం కానరాని నా బ్రతుకులో ఉదయించే సూర్యుడై - ఒంటరైన నాదరి చేరితివే కడు పేదనైన నన్ను - కడవరకు తోడుంటానని కరువైన కానరాని - కనికరమే చూపించి కంటి పాపల నన్ను కాచితివే 2) దయనొందిన జీవితంలో - ధన్యుడనైతిని నీ ఆజ్ఞల ద్వారా నన్నెడు సిగ్గుపడనీయ్యాలేదు - నీ ఉపదేశ క్రమములో సరిచేసి బ్రతికించి - సంఘములో నిలిపి మంచి పాత్రగా - మహిమతో నింపిన శిల్పకారుడా నా మంచి యేసయ్యా


Follow Us