LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసయ్య నా ప్రాణమా


యేసయ్య నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా - 2
అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన
నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాద్యుడా


చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
నీలో నను చేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా -2
ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే - 2
సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే -2


జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగాఉంచావని
ఉత్సాహగానము నే పాడనా - 2
ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని -2
ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా - 2


మధురముకాదా నీనామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్రగీతముగా నేపాడనా -2
నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా - 2
స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా -2


స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words