LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


జయ సంకేతమా దయా క్షేత్రమా


జయ సంకేతమా - దయా క్షేత్రమా 
నన్ను పాలించు నా యేసయ్య(2)
అపురూపము నీ ప్రతి తలుపు 
అలరించిన ఆత్మీయ గెలుపు (2)
నడిపించే నీ ప్రేమ పిలుపు

1) నీ ప్రేమ నాలో ఉదయించగా 
నా కొరకు స్వరము సమకూర్చేనే (2)
నన్నెల ప్రేమించ మనసాయెను 
నీ మనసెంతో మహోన్నతము
కొంతైనా నీ రుణము తీర్చేదెలా  
నీవు లేక క్షణమైన బ్రతికేదెలా
విరిగి నలిగిన మనసుతో నిన్నే
సేవించేద నా యజమానుడా (2) 

2) నిలిచెను నా మదిలో నీ వాక్యమే 
నాలోన రూపించే నీ రూపమే (2)
దీపము నాలో వెలిగించగా 
నా ఆత్మ దీపము వెలిగించగా 
రగిలించే నాలో స్తుతి జ్వాలలు 
భజియించి నిన్నే కీర్తింతును 
జీవితగమనం స్థాపించితివి
సీయోను చేర నడిపించుమా (2)

3.నీ కృప నాయెడల విస్తారమే
ఏనాడు తలవని భాగ్యమిది(2)
నీ కృప నాకు తోడుండగా
నీ సన్నిధియే నాకు నీడాయెను
ఘనమైన కార్యములు నీవు చేయగా 
కొదువేమి లేదాయె నాకెన్నడు
ఆత్మబలముతో నన్ను నడిపించే 
నా గొప్ప దేవుడవు నీవేనయ్యా
బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా (2)




Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words