
జగములనేలే పరిపాలక
జగములనేలే పరిపాలక - జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనసుతో స్తోత్ర గానము పాడెద నిరతము ప్రేమగీతము యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య 1) మహారాజుగా నా తోడువై - నిలిచావు ప్రతి స్థలమున నా భారము నీవు మోయగా - సులువాయే నా పయనము నీ దయచేతనే కలిగిన క్షేమము - ఎన్నడు నను విడదే (2) నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే(2) 2) సుకుమారుడా నీ చరితము - నేనెంత వివరింతును నీ మహిమను ప్రకటించగా - నేనెంతో ధన్యుడను ఘనులకు లేదే ఈ శుభ తరుణం - నాకిది నీ భాగ్యమా(2) జీవితమంతా నీకర్పించి నీ రుణము నే తీర్చనా (2) 3) పరిశుద్ధుడా సారధివై - నడిపించు సీయోనుకే నా యాత్రలో నే దాటిన -ప్రతి మలుపు నీ చిత్తమే నా విశ్వాసము నీ పైనుంచి - విజయము నే చాటనా (2) నా ప్రతిక్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా (2)


Follow Us