
నా నమ్మిక నీవు మాత్రమే
నా నమ్మిక నీవు మాత్రమే నేనెపుడు నిను విడువను యేసయ్యా నేనెపుడు నిను విడువను అ.ప.: ఎన్ని కష్టాలైనా బెదరను ఎంత బాధైనా వెనుదిరుగను 1.విలువగు రక్తాన్ని చిందించిన కలుషములన్ని హరియించిన నీ ప్రేమను ప్రకటింతును నీ సేవ జరిగింతును 2.బలమగు హస్తాన్ని అందించిన మరణము నుండి బ్రతికించిన నీ చాటున నివసింతును నీలోనే ఫలియింతును 3.కరుణతో వాక్యాన్ని పంపించిన కలవరమంతా తొలగించిన నీ కార్యము వివరింతును నీతోనే పయనింతును


Follow Us