
ఎడారిలో సెలయేరై పారేను
ఎడారిలో సెలయేరై పారేను నీ ప్రేమ ఎండిన భూమిలో మొకై మొలిచెను యేసు నీ ప్రేమ అ.ప: నీ ప్రేమ ధారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్య నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్య"2" యేసయ్య నీ ప్రేమకు స్తోత్రం యేసయ్య కృపకై వందనం 1.ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు ఆశ్రయం ఎరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు "2" ఏమిచేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నేన్నున వేళలో "2" నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు "2" 2.అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆధారించావు కలతచెందిన నన్ను నీ వాక్యము చేతనే నను బలపరిచావు "2" ఏమిచేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నేన్నున వేళలో "2" నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు "2"


Follow Us