
నీ కృపాతిశయమును అనునిత్యము
నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును ఆ.పల్లవి:- నీ కృపా నీ కృపా ఆకాశముకంటే హెచ్చైనది మౌనిగా యెటులుండెదా సాక్షిగా ప్రచురించకా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరేవరకు 1. ఇంకా బ్రతికి ఉన్నామంటే - కేవలము నీ కృపా ఇంకా సేవలో ఉన్నామంటే - కేవలము నీ కృపా ఏ మంచితనము - లేకున్ననూ కొనసాగించినది నీ కృపా నిలబెట్టుకొన్నది నీ కృపా ||నీ కృపా|| 2. పది తరములుగా వెంటాడిన - మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా - మార్చేనే వెయ్యి తరములు అన్యురాలైన ఆ రూతును - ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నన్ను దీవించగా ఏ శాపము నాపై పనిచేయదు ||నీ కృపా|| 3. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే - కేవలము నీ కృపా మెతుకు బ్రతుకు ఉన్నాయంటే - కేవలము నీ కృపా కృపతోనే రక్షణనిచ్చావు - నా క్రియల వలన కానే కాదు జీవితమంతా ఋణస్థుడను నీయందే నిత్యము అతిశయము ||నీ కృపా|| 4. ఇల్లు వాహనం ఉన్నాయంటే - నీదు కృపాదానమే బలము ధనము ఉన్నాయంటే - నీదు కృపా దానమే ఏ అర్హత నాలో లేకున్ననూ - కృపా భిక్షయే నా యెడల జీవితమంతా కృతజ్ఞుడను జీవితమంతా పాడెదను ||నీ కృపా|| 5. ప్రియులే నన్ను విడనాడినా - శోకమే నా లోకమా అనాధగానే మిగిలానే - నా కథ ముగిసినదే నీ కుడిచేతిలో ఉంచగనే - బెన్యామీను వంతుగా మారే ఐదంతలాయే నా భాగ్యము విధిరాతనే మార్చెనే నీ కృపా ||నీ కృపా||


Follow Us