
నీవు తప్ప దిక్కేదయా
నీవు తప్ప దిక్కేదయా నీలా కృప చూపెదెవరయా (2) కనికర సంపన్నుడా కృప మహదైశ్వర్యుడా (2) నీవు తప్ప నాకిలలో ఎవరులేరయా (2) లేరయా లేరయా నాకిలలో ఎవరులేరయా నీవయా నీవేనయ్యా నా మేలుకోరె ప్రభువు నీవయా (2) 1) రోగ చుక్క వేదనలు నన్ను చుట్టిన ఆదరించు వారు లేక కుమిలి పోయిన (2) విడువను ఎడబాయనని చెంత నిలిచిన (2) స్వస్థపరచి మేలులు చేసిన నీకే వందనం (2) 2) ఏమై-పోతుందీ-నని బయమంచెందిన ప్రతిక్షణము కలవరము కుంగదీసిన భయమెందుకు వున్నానని అభయమిచ్చిన (2) ధైర్యపరచి నెమ్మదినిచ్చిన నీకే వందనం (2) 3) స్థితి-గతులు అర్ధంకాక తడవులాడిన ఆలోచించె శక్తిలేక సొమ్మసిల్లిన (2) ఆలోచన కర్తవై నా మనసు తాకిన (2) స్థిరపరచి నడిపించిన నీకే వందనం (2) 4) ప్రభువా క్షమియించుమని చెంతచేరినా చేసిన తప్పిదములకై వేదన చెందినా (2) రక్షక నీ రక్తముతో నన్ను కడిగిన (2) నన్ను క్షమియించి చేరదీసిన నీకే వందనం (2)


Follow Us