LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నిను మాత్రమే నే నమ్మానయా


నిను మాత్రమే నే నమ్మానయా
నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా  (2)
నీ బాహుబలమే నడిపించును
నా స్థితులన్నిటిని సరిచేయును  (2)
కృప చూపువాడవయా నీ పిల్లలకు  (2)

1. నీవు సెలవియ్యగా కలుగనిదేముంది
వాక్కును పంపగా జరుగనిదేముంది  (2)
సకలము నీదెనయా శ్రీమంతుడా
స్తుతి నీకు పాడెదనయా  (2)
సమకూర్చువాడవయా నీ పిల్లలకు  (2)

2. నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు
కార్యము చేయగా అడ్డుపడువాడెవడు  (2)
యుద్ధము నీదెనయా ఓ శూరుడా
ముందుకు సాగెదనయా  (2)
జయమిచ్చువాడవయా నీ పిల్లలకు  (2)

3. నీవు కరుణించగా కాదనువాడెవడు
శక్తితో నింపగా ఓడించువాడెవడు  (2)
సాయము నీదెనయా సహాయకుడా
నీలో దాగెదనయా  (2)
బలమిచ్చువాడవయా నీ పిల్లలకు  (2)

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words