
గతకాలమంతయును కాచినావు
గతకాలమంతయును కాచినావు యేసయ్య నీ కృపను మాపై చూపి నడిపించినావయ్య { నా దిక్కు నీవేనయ్య దయచూపు యేసయ్య నా దైవం నీవేనయ్య కరుణించు యేసయ్య } నూతన కార్యములు – ఘనమైన కార్యములు ఆశ్చర్య కార్యములు – అంతులేని కార్యములు (2) నీవు మాత్రమే చేయగలవయ్య నీవు మాత్రమే చేయగలవు మనుష్యుని పాపమునుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్య ఈ ధరణిలో (2) పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్య (2) ( నీవు మాత్రమే ) పితరుల శాపమునుండి అద్భుతంగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు (2) వెయ్యి తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్య (2) ( నీవు మాత్రమే ) చెరగని ఆనందంతో వీడని అనుబంధంతో దినదినము నన్ను సంధించుచున్నావు (2) మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవే యేసయ్య (2) ( నీవు మాత్రమే )


Follow Us