
ఏమని స్తుయింతును ఏమని పొగడనూ
ఏమని స్తుయింతును ఏమని పొగడనూ - నా యేసు నీ కృపను నే- మరువ జాలను (2) నీ కృపయే నా బలము నీ కృపయే విజయము (2) 1. పనికిరాని నను నీవు పైకి లేవ నెత్తితివి - నీదు పాత్రగా మార్చి నన్ను వాడుకొంటివి (2) మహిమ గలిగిన ప్రత్యక్షతలో నీదు కృపలతో నింపితివి (2) (నీ కృపయే నా) 2.ఇరుకునందు నీకు నేను ప్రార్థన చేయగా - విశాల స్థలమందు నాకు - నీవు దర్శనమిచ్చితివి (2) విలువగలిగిన - మర్మములు నాకు తెలీయ జేసితివి (2) (నీ కృపయే ) 3. సాతానును ఓడించుటకు నాకు బలమును ఇచ్చితివి నీదు ఆత్మతో - నింపి నన్ను అభిషేకించితివి (2) నీదు ద్వజమును పైకెత్తుటకు - నన్ను నీకై నిలిపితివి (2) (నీ కృపయే )


Follow Us