LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో


సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో
నీ ప్రేమ గీతం పాడెద
నీ గోప్ప కార్యం చాటెద
నా జీవితం మార్చిన యేసయ్యా
ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా           ||సంగీత||

నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి
కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2)
పాపములు క్షమియించి నను మార్చిన
దోషములు భరియించి దరిచేర్చిన         ||నీ ప్రేమ||

నా కష్ట సమయమున నా చెంతనే నిలచి
విడువక నడిపించిన విధమును వివరించెద (2)
క్షేమమును కలిగించి నను లేపిన
దీవెనలు కురిపించి కృపచూపిన          ||నీ ప్రేమ||

నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి
కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద (2)
వాక్యముతో దర్శించి బలపరిచిన
సత్యముతో సంధించి స్థిరపరిచిన         ||నీ ప్రేమ||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words