
నీ సన్నిధే నాకు తోడుగా
నీ సన్నిధే నాకు తోడుగా- విశ్రాంతిని కలుగజేయగా మాట యిచ్చినవాడువు నమ్మదగినవాడవు మా కార్యములన్ని సఫలము చేస్తావు యేసయ్యా మా రాజా యేసయ్యా యజమానుడా నీవు మాటయిచ్చి నీ తోడని ప్రమాణము చేసిన నీకంటే గొప్పవారు ఎవరున్నారయ్యా నీవు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారుయ్యా ఆ రాజులు సైతం చిన్నవారేగా ఆధికారులు సైతం అల్పులే కదా యేసయ్యా మా రాజా - యేసయ్యా యజమానుడా నీ మహిమయే మేఘముగా ఈ గుడారము నిండిన నీ రూపే నాలోన నే చూస్తున్నానయ్యా నీవు మార్చిన ఈ జీవితం ఊహించలేదయ్యా క్షమించగలిగే మనసిచ్చావయ్యా ప్రేమించగలిగే వరమిచ్చావయ్యా యేసయ్యా మా రాజా - యేసయ్యా యజమనుడా నీ తలపే నా యెడ ఘనమైనది యేసయ్యా నా గమ్యం నీతోనే - అది- నిశ్చయమేస్వయ్యా నేను కొరుకున్న ఆ రేవుకే నడిపిస్తావయ్యా చూచుచున్న దేవుడ నివయ్యా నీ బాహుబలము తగ్గలేదయ్యా యేసయ్యా మా రాజా యేసయ్యా యజమనుడా


Follow Us