అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు
అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే (2) 1. మృతతుల్యమైన శారా గర్భమును – జీవింపచేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి – ఆధారమైన నీకే (2) ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్ధాన ఫలములు (2) 2. అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో – ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు – నిరీక్షణనిచ్చిన నీకే (2) కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా (2)


Follow Us





